taurine side effects

Jokes Corner

పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..

భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే. భార్య : ఎందుకు … ?? భర్త : మరి నెల రోజులనుండి ఐరన్‌ టానిక్‌ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..

“నీ బొమ్మ వేస్తున్నాను నాన్న”

ఏడేళ్ళ వాసవి సీరియస్‍గా బొమ్మ గీస్తోంది “ఏం చేస్తున్నావురా?” అడిగాడు నాన్న. “నీ బొమ్మ వేస్తున్నాను నాన్న” “అబ్బ గుడ్” కాసేపటికి… “బొమ్మ బాగా రావట్లేదు నాన్న” చెప్పింది వాసవి. “సరేలే. వదిలేయ్” “పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా?”

“నాకేం? నేను మగాణ్ణి”

“నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు” కోపంగా అన్నడు గోవర్ధన్ భార్యతో. “ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?” అన్నది భార్య. “నాకేం? నేను మగాణ్ణి” “మరి ఆయన మాత్రం మగాడు కాదూ?” అన్నది భార్య.

“ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు”

“మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను” భార్యతో చెప్పాడు గోవర్ధన్. “నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు” చెప్పింది భార్య.

“ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?”

రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు. “నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో సలిసి తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా […]

“నీ దృష్ఠిలో మంచిదంటే ఏంటి? ”

తన రూమ్‍లోకి క్యాలెండర్ కావాలంటూ బజారుకేళ్ళాడు రఘు. యజమాని క్యాలెండర్లు చూపిస్తుంటే ప్రతీ దాన్నీ వద్దంటూ…. “ఇంకాస్త మంచిదివ్వండి” అంటున్నాడు. “నీ దృష్ఠిలో మంచిదంటే ఏంటి? ” విసుకుగా అడిగాడు యజమాని. “అంటే…… స్కూలుకు సెలవులు బాగా ఇచ్చేలా ఎర్రరంగు గళ్ళు ఎక్కువుండాలి”

“పెళ్ళి చేసుకోండి” సలహా ఇచ్చాడు డాక్టర్.

“నాకు చాలాకాలంపాటు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెబుతారా?” అడిగాడు రాము “పెళ్ళి చేసుకోండి” సలహా ఇచ్చాడు డాక్టర్. “అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?” ఆశ్చర్యపోయాడు రాము. “అదేం లేదులే. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది” అసలు సంగతి చెప్పాడు డాక్టర్.

“బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను”

“బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను” అన్నాడు డాక్టర్ రాముతో. పక్కనే ఉన్న రాము తండ్రి “మా వాడు ఇంగ్లీషు మీడియం అండీ అ, ఆలు రావు” అన్నాడు డాక్టర్‍తో

ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే

“అదేంట్రా… రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?” క్రిష్ణని అడిగాడు సాగర్. “ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను” చెప్పాడు క్రిష్ణ.

నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది

“నాన్నా… నాన్నా… నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?” ఐదో కొడుకు అడిగాడు తండ్రిని. “వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది” అన్నాడు తండ్రి. “ఫర్లేదు నాన్నా… మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను” చెప్పాడు కొడుకు అమాయకంగా.