taurine side effects

Jokes Corner

ఈ పెద్ద వాళ్ళందరిది పాడుబుద్ధి!!

” ఈ పెద్ద వాళ్ళందరిది పాడుబుద్ధి ” అని గిరితో అన్నాడు హరి. ” ఎలా చెప్పగలవు ? ” అని అడిగాడు గిరి. ” మొన్నేదో అబద్ధం చెప్పానని ఇంట్లో కొట్టారు. నిన్న యింటి ఓనర్ వస్తే నేను లేనని చెప్పు అంటూ అబద్ధం ఆడించారు ” అని అసలు విషయం చెప్పాడు హరి.

నేను ఈరోజు ఉపవాసం

లలిత : ఏం శాంతి తీరిగ్గా ఉన్నావ్ ఈరోజు బియ్యం ఏరే పని లేదా ? శాంతి: అబ్బే ఈ రోజు నాకాపని లేదు లలిత : ఏం రాళ్ళు లేవా ? శాంతి: నేను ఈరోజు ఉపవాసం నాకు వంట లేదు ఆయనకి మాత్రమే వంట…!!!

ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ… ఒక్కో నెహ్రూ… ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి”

“మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ… ఒక్కో నెహ్రూ… ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి” ఆవేశంగా పాఠం చెబుతున్నాడు మాస్టారు. “అంటే మేమందరం చావాలనా మీ ఉద్దేశ్యం?” లేచి కోపంగా అడిగాడో విద్యార్ధి.

రాత్రిళ్లు నాకు పీడకలలు వస్తున్నాయి డాక్టర్‌!!’

బ్రమరాంబ : ‘ఈ మధ్య రాత్రిళ్లు నాకు పీడకలలు వస్తున్నాయి డాక్టర్‌!!’ డాక్టర్‌: ‘ఏ టైపు కలలు..’. బ్రమరాంబ : ‘ నేనే వంట చేస్తున్నట్టూ… మా ఆయన సోఫాలో కూచొని నన్ను కాఫీ తెమ్మని కేకేసినట్టూ…’ ఆందోళనగా వివరించింది బ్రమరాంబ

జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?…

“బాబూ.. ” జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా? “ అనే పుస్తకం ఉందా?” అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో . “ఉంది సార్… నూట ఇరవై రూపాయలు” అన్నాడు షాపతను. “Thank You” డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ. “Excuse me sir… చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు” అని అడిగాడు షాపతను. “What?.. నేను చదవనా? ఎవర్న్నారు?” కోపంగా అన్నాడు రామకృష్ణ. “ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!” గుర్తు చేశాడు షాపతను.

“బాబూ.. నా పర్సు పోయింది….

బస్సు వెళ్తోంది. హఠాత్తుగా సుబ్బారావు కేకపెట్టాడు. “బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను” ఏడుస్తూ అన్నాడు. “నాకిస్తే ఐదొందలిస్తాను” మరో వ్యక్తి అరిచాడు. “నాకిస్తే వెయ్యి” “నాకిస్తే రెండు వేలు…” “నాకిస్తే నాలుగు వేలు…” “అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా” అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.

ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి….

ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. “ఊ కొట్టు… కొట్టు…. దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి” అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి. “మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?” అడిగాడు పక్కనున్న వ్యక్తి. “కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని” అని చెప్పాడు అతను…..

రాకేష్ జోక్స్….

రాకేష్: నాకు రైల్లో నిద్ర పట్టలేదురా… సురేష్: ఎందుకు… రాకేష్: అప్పర్ బర్త్ వచ్చింది.. సురేష్: ఎవరితోనైనా ఎక్స్‌చేంజ్ చేసుకోలేకపోయావా… రాకేష్: చేసుకుందామంటే కింది బెర్త్‌లో ఎవరూ లేరు..

పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం”

“ఏంటి వదినా… ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా?” అడిగింది లలిత . “అవునే లలిత  . పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం” చెప్పింది కావ్య.

“ఒకే సారి పదికిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా?”

“షాపులో కిలో నూనె ఎంతండీ?” అడిగింది సుజాత “నలభై రూపాయలు” చెప్పాడు వ్యాపారి “ఒకే సారి పదికిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా?” “ఒక పావు కిలో తగ్గుతుంది”! అని చెప్పాడు వ్యాపారి నవ్వుతూ…