కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖుష్బూ
ఆమె.. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి గల కారణాలను సినీ నటి ఖుష్బూ వివరించారు. పార్టీలో కు రావడం పుట్టింటింటికి వచ్చినంత సంతోషంగా ఉందని, తన రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని కుల, మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమ న్యాయం చేయగల ఏకైక లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని , పైగా ముంబైలో పుట్టి పెరగడం వల్ల తాను చిన్న వయస్సు నుంచే కాంగ్రెస్ పార్టీపై మంచి అభిమానం ఉందన్నారు అందువల్లే ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు.