హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టిన రోజు

అక్కినేని నాగార్జున పుట్టిన రోజు
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పుట్టిన రోజు

మేజర్ ధ్యాన్ ‘చంద్’ సింగ్  అందరికీ తెలిసిన ఒక భారత హాకీ క్రీడాకారుడు. ఎప్పటికీ అతనే గొప్ప క్రీడాకారుడుగా కీర్తించబడినాడు. ఒక దిగ్గజం అయిన29.08.2014-Dhyan-Chand

అతను తన గోల్ స్కోరింగ్ విన్యాసాలతో, మొదట ఆటగానిగా తర్వాత కెప్టెన్ గా గుర్తించబడినాడు.చంద్ మూడు ఒలంపిక్ బంగారు పతకాలు  మరియు 1956లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. అతడు సహ ఆటగాడైన రూప్ సింగ్ యొక్క అన్న.

ధ్యాన్ చంద్ సింగ్ ఆగష్టు 29, 1905లో ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ లో జన్మించాడు.  తండ్రి సామేశ్వర్ దత్ సింగ్,  చంద్ కి ఇద్దరు సోదరులు – మూల్ సింగ్, మరియు రూప్ సింగ్ . ఆరవ తరగతి తరువాత అతను తన చదువుకు స్వస్తి చెప్పాడు. చదువుకొనే రోజుల నుండి ధ్యాన్ చంద్ కి హాకీ ఆడటం అంటే ఇష్టం మరియు  ఆ రోజులలో భారతదేశంలో ఉన్న ప్రముఖ హాకీ క్లబ్ లలో ఇది కూడా ఒకటి. జట్టు సభ్యులందరూ చక్కగా ఆడి ఎన్నో జాతీయ టోర్నమెంట్స్ లో విజయం సాధించారు.
అతను కుస్తీ పోటీలను ఇష్టపడినప్పటికీ, యువ ధ్యాన్ కి క్రీడలపై ఎక్కువ మక్కువ లేదు.1922లో తన 16వ ఏట చంద్ భారత సైన్యంలో చేరాడు. సుబేదార్-మేజర్ బాలే తివారి అతని క్రీడా నైపుణ్యాలను గమనించాడు. ఆటపై లోతైన అవగాహన కలిగిన తివారి చంద్ యొక్క ప్రతిభను గుర్తించాడు. ఆయన, అతనికి సలహాదారుగా మారి, అతని క్రీడా జీవితానికి పునాది వేశాడు.

అక్కినేని నాగార్జున పుట్టిన రోజు
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పుట్టిన రోజు

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *