శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం!!
మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటిస్తానని ప్రకటించారు. 149 చిత్రాలను పూర్తి చేసుకున్న చిరంజీవి 150వ చిత్రంకథ కోసం ఎదురు చూస్తున్నారు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తిని చిరంజీవి ఇటీవల వ్యక్తం చేశారు. ఆసక్తికర విషయం ఏమిటంటే చిరంజీవితో చిత్రం చేయడానికి శంకర్ రాయబారం చేస్తున్నట్టు తాజా సమాచారం.