మదగజ ఘీంకారాలు, రథచక్రాల ధాటికి నలిగిపోతున్న అభాగ్యుల ఆర్తనాదాలు,తలపించే కథాంశంతో ‘బాహుబలి’
మదగజ ఘీంకారాలు, రథచక్రాల ధాటికి నలిగిపోతున్న అభాగ్యుల ఆర్తనాదాలు,
గుర్రపు డెక్కల చప్పుళ్లు, కరవాల విన్యాసాలు, రాజకీయ యుక్తులు, మహాభారతాన్ని తలపించే కథాంశంతో, కురుక్షేత్రాన్ని గుర్తుకు తెచ్చే యుద్ధ విన్యాసాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘బాహుబలి’ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. . ఈ షెడ్యూల్‌తో ‘బాహుబలి’ తుది దశకు చేరుతుంది. తెలుగు తెరపై ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరింపజేసే సినిమా ఇదనీ, హాలీవుడ్ సినిమాను చూస్తున్న అనుభూతి ప్రేక్షకుల్లో కలగడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా చెబుతున్నారు.