#Uncategorized

అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్‌తో లింకప్

ఆధార్ కార్డు లేని ప్రజలు దాదాపు మన జిల్లా లొ 10 లక్షల పైనే ఉన్నట్లు అంచనా ఇందులో 75 శాతం మందికి ఆధార్ నంబుర్ లు వచ్చినా 25 శాతం aadhar-card-is-Most-importantమందికి రాలేదు ఇందులొ 15 శాతం మందికి ఏకంగా ఐదారుసార్లు వివరాలతొ పాటు బయోమెట్రిక్ నమోధు చేయించుకున్నా ఆధర్ నెంబర్ రాలేదు
అయితే రైతు రుణ మాఫి అమలుకి అదే పెను శాపం అయ్యింది రుణ మాఫి అమలు చేయడానికి ప్రభుత్వం పట్టదారు పాస్ పుస్తకాలను ఆధర్ తొ అనుసందానం చేస్తొంది ఒకవెల అనుసందానం కాకపొతే రుణ మాఫి తొ పాటు వివిధ ప్రభుత్వ పతకాల క్రింద లబ్ధికి దూరం కావాల్సి వస్తుంది.

ఆధార్ నమోదు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆధార్ నమోదు కోసం ప్రజలు తరలివస్తుండటంతో మీ-సేవ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్‌తో లింకప్ చేయడం వల్ల ఆధార్ నమోదుకు ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వం రుణమాఫీకి ఆధార్‌ను లింకప్ చేస్తోంది. పట్టాదారు పాసు పుస్తకాలను, రేషన్ కార్డు లబ్ధిదారులను, గ్యాస్ వినియోగదారులను, ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాబ్ కార్డులను, సామాజిక భద్రతా పింఛన్లను, హౌసింగ్ లబ్ధిదారులను… ఇలా అన్ని కార్యక్రమాలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తుండటంతో నమోదు కోసం వచ్చే వారితో మీ-సేవ కేంద్రాల వద్ద రద్దీ కనబడుతోంది. జిల్లాలో 42 లక్షలకు పైగా ఆధార్ నమోదు కావాల్సిన వారు ఉండగా, ఇప్పటివరకు 36.32 లక్షల మందికి ఆధార్ యూఐడీ నెంబర్లు వచ్చాయి. మిగిలినవారికి ఆధార్ యూఐడీ నెంబర్లు లేవు. వీరిలో చాలామంది ఒకటికి నాలుగైదుసార్లు నమోదు చేసుకున్నా యూఐడీ నెంబర్ రాలేదు. వీరందరూ నేడు అల్లాడుతున్నారు. రుణమాఫీకి విధిగా యూఐడీ నెంబరే ఇవ్వాల్సి ఉంది. ఇది లేకపోతే రైతుల వివరాలు సిస్టమ్‌లో నమోదు కావడం లేదు. దీంతో దాదాపు ఐదారు లక్షల మంది ఆధార్ నెంబర్ల కోసం కుస్తీ పడుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు లేవు. మీ-సేవ కేంద్రాల్లోనే పర్మనెంటు ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 288 మీ-సేవ కేంద్రాలు ఉండగా, 97 సెంటర్లలో ఆధార్ నమోదుకు సంబంధించిన కిట్‌లు ఏర్పాటు చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *