taurine side effects


ప్రధాని మోడీకి గుజరాత్ లో గుడి!

Happy Birth Day to Jagapathi Babu
మరో బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసిన సౌత్ ఇండియన్ బ్రూస్ లీ

Modi---12.02పవిత్ర భారతదేశంలో వీధికో గుడి దర్శనం ఇస్తుంది. మనకు ఉన్న దేవుళ్ళు అంతమంది మరి. కొందరు తమ అభిమాన సినీ తారల కోసం కూడా గుళ్ళు కడుతూ ఉంటారు. అయితే రాజకీయనాయకులకు గుడి కట్టినట్లు మాత్రం చాలా అరుదుగా వింటుంటాం. ఇక ఇప్పుడు తాజాగా కొంతమంది ప్రజలు తమ అభిమాన నాయకుడికి గుడి కట్టి రెండు పూటలా దీపారాధన కూడా చేస్తున్నారట. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న ప్రధాని మోడీకి గుజరాత్ లో ఉన్న ఫాలోయింగే వేరు. ఇక ఈ అభిమానంతో ఆయన ఆరాధకులు గుజరాత్ రాజ్ కోట్ సమీపంలో ఉన్న కతారియా గ్రామంలో ఒక మందిరాన్ని నిర్మించి అందులో మోడీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనితో చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజలంతా వచ్చి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారట.

కాగా గుడిని నిర్మించేందుకు 2 సంవత్సరాలు పట్టిందని, విగ్రహ తయారీకి దాదాపు లక్షా అరవై ఐదు వేలు ఖర్చు అయ్యిందని గుడి కట్టించిన వ్యక్తి రమేష్ ఉన్ దాడ్ పేర్కొన్నారు. ఇక విగ్రహ తయారీకి ఒడిశా నుండి శిల్పులను తెప్పించామని, ఈ నెల 15న అధికారికంగా మోడీ మందిరాన్ని ప్రారంభిస్తామని ఆయన వివరించారు.

Happy Birth Day to Jagapathi Babu
మరో బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసిన సౌత్ ఇండియన్ బ్రూస్ లీ

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *